పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత: తారా కళాశాల ప్రిన్సిపాల్ రమేష్

సంగారెడ్డి, ఆగస్టు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ విభాగాలు, హరితహారం కమిటీ ఆధ్వర్యంలో ఏక్ పేడ్ మాకే నామ్పర్ అనే కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రమేష్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణలో సమతుల్యత ఉన్నప్పుడు జీవరాశి మనుగడకు ఎటువంటి ప్రమాదం రాదని, పర్యావరణంలో సమతుల్యతను కాపాడాలంటే ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని, చెట్లు వాతావరణంలో కాలుష్యాన్ని తొలగించి జీవరాశి మనుగడకు తోడ్పడుతాయని అన్నారు. తారా కళాశాలలో వన మహోత్సవంలో భాగంగా చెట్లను నాటడమే కాకుండా, అంతకు ముందు నాటిన చెట్లకు పాదులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత మన అందరిదని, దానికై మనం కృషి చేసినప్పుడే భవిష్యత్తు తరాల మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ సీ అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ వాణి, డాక్టర్ సదయ కుమార్, ఇతర అధ్యాపక బృందం ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment