Headlines :
-
గద్వాల కలెక్టర్‌కు బీఎస్పీ వినతిపత్రం: నిందితులను రిమాండ్ చేయాలని డిమాండ్
-
బీఎస్పీ నిరసన: గద్వాల జిల్లా తహసీల్దార్ దాడి కేసులో నిందితులను రిమాండ్ చేయాలని కోరిన వినతిపత్రం
-
జోగులాంబ గద్వాల జిల్లాలో బీఎస్పీ నేతల విజ్ఞప్తి: నిందితుల రిమాండ్
-
“న్యాయం కావాలి” – బీఎస్పీ నేతలు గద్వాల కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు
-
గద్వాల జిల్లా కలెక్టర్ వద్ద బీఎస్పీ నిరసన, నిందితులను రిమాండ్ చేయాలని ఆందోళన
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల తహసీల్దార్ పై దాడి చేసి నెల రోజులు కావచ్చిన నిందితులను రిమాండ్ చేయలేదు. నిందితులను రిమాండ్ చేయాలనీ రేపు అనగా మంగళవారం గద్వాల జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలోని తహసీల్దార్ కార్యాలయలల్లో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. అనంతరం 3 గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంకు చేరుకొని నిరసన చేసిన అనంతరం కలెక్టర్ కి వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. భాధితులు నిందితులుగా నిందితులు భాదితులుగా మారిన ఈ కేసును గద్వాల డిఎస్పీ విచారణ చేసిన నేటికీ రిమాండ్ చేయలేదు. నిర్లక్ష్యం చేస్తున్న ఈ కేసు విషయంలో ప్రభుత్వ అధికారులకు న్యాయం చేయాలనీ కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వనున్నాము. ప్రభుత్వం మరియు ప్రజలకు సంధానకర్త ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం సమాజమే తల దించుకోవలసిన విషయం. నిందితులను రిమాండ్ చేయాలనే ఉదేశ్యంతో అన్ని మండల కేంద్రాలతో పాటుగా గద్వాల జిల్లా కలెక్టర్ బీ. సంతోష్ కి కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది.
ఆకేపోగు రాంబాబు Bsp జిల్లా అధ్యక్షులు జోగులాంబ గద్వాల