అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి

అర్హులైన నిరుపేదలు ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి

* కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము విజయకుమార్, కొండపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసరి లింగారావు

* జప్తి నాచారం గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

*కొండపాక, డిసెంబర్ 29,

అర్హులైన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమ్ము విజయకుమార్ అన్నారు. ఆదివారం కొండపాక మండలం జప్తినాచారం గ్రామానికి చెందిన ముస్త్యాల పర్శరాములు కు ఆరు వేల రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు వాసరి లింగారావులు మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి పేద ప్రజలకు ఆపన్న హస్తంగా ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా వుండే పార్టీ అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముస్త్యాల నర్సింలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ముస్త్యాల కొమురయ్య, ముస్త్యాల కిషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లికార్జున్, నాగరాజు, శ్రీశైలం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment