రెండు అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఎండీఆర్ ఫౌండేషన్

సంగారెడ్డి/పటాన్ చెరు, ఆగస్టు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): సమాజ సేవనే ప్రధాన కర్తవ్యంగా భావిస్తూ, యువతలో మానవతా విలువలు పెంపొందించాలనే లక్ష్యంతో ఎండీఆర్ ఫౌండేషన్ ప్రతి రోజూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆ క్రమంలో పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఒక వృద్ధురాలికి కుటుంబ సభ్యుల్లా భావించి అంత్యక్రియలు నిర్వహించగా.. మరో వైపు కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న 45 సంవత్సరాల అస్సాంకు చెందిన వ్యక్తి కుటుంబం, పిల్లలు ఉన్నప్పటికీ మద్యానికి బానిసై చివరికి జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకుని ఒంటరితనంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యy చేసుకున్నాడు. అతనికి సంబంధించిన వారు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఎండీఆర్ ఫౌండేషన్ అతనిని కూడా తన కుటుంబ సభ్యుడిగా భావించి అంత్యక్రియలు నిర్వర్తించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment