ఎస్ బీ కానిస్టేబుల్ కు ప్రశంస పత్రం అందజేసిన మంత్రి

సంగారెడ్డి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా హత్నూర, గుమ్మడిదల స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న హెచ్.నరేందర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. గత కొంతకాలంగా స్పెషల్ బ్రాంచ్ విభాగంలో విధులు నిర్వహిస్తూ, ఉన్నతాధికారుల అభిమానాన్ని చురగొన్నారు. అంతేకాకుండా హత్నూర, గుమ్మడిదల మండలాలలో పలు సంఘటనలను పసి గట్టి అధికారులకు ముందస్తు సమాచారమిచ్చి.. వాటి నివారణకు తోడ్పాటునందించిన నరేందర్ కు ప్రశంస పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment