ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా అధికారుల ఫోన్ నెంబర్లు తెలియపరచాలి

*ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా అధికారుల ఫోన్ నెంబర్లు తెలియపరచాలి*

*సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్*

*హుజురాబాద్ నవంబర్ 21 ప్రశ్న ఆయుధం::-*

ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యాలయ అధికారి పేరు ఫోన్ నెంబర్ల్ పనిచేసే సిబ్బంది వివరాలు సమాచారం ఉండకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ ఆరోపించారు హుజురాబాద్ మండల కేంద్రంలో డివిజన్ కేంద్రమైనటువంటి,

హుజురాబాద్ పంచాయతి రాజ్ డివిజన్ ఆఫీసులో (డి ఈ) ప్రభుత్వ అధికారి ప్రభుత్వ ఆఫీసులో పనిచేసే సిబ్బందికి ఫోన్ నెంబర్ చెప్పకపోవడం చాలా దురదృష్టకరమని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ ఆరోపించారు.

హుజురాబాద్ డివిజన్ కేంద్రమైనటువంటి హుజురాబాద్ మండల కేంద్రంలో వివిధ మండల కార్యాలయాల్లో కార్యాలయంలో పనిచేసే అధికారుల హోదా పేర్లు ఫోన్ నెంబర్లు ప్రజలకు తెలిసే విధంగా వివిధ సమస్యలపై వచ్చే, ప్రజా సంఘాలు, పార్టీల నాయకులకు, సమాచారం నిమిత్తం, కార్యాలయంలో బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, వలన కార్యాలయాలలో కి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అక్కడున్నటువంటి సిబ్బందిని సమాచారం అడుగుతే, సార్లు మాకు నెంబర్లు ఇవ్వలేదు, అని సమాచారం ఇస్తున్నారని అధికారులు డ్యూటీలకు వచ్చి ఆయా సంబంధిత కార్యాలయంలో రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లకుండా సైట్ల మీదికి వెళ్లారని చెప్పడం, అధికారి ఫోన్ నెంబర్లను గోప్యాంగ ఉంచడం. ఇది ఎంతవరకు సమంజసమని, ప్రజలు వివిధ రూపాలలో చెల్లించే పన్నులతో ఈ ప్రభుత్వఅధికారులకు వేతనాలు పొందుతున్నప్పటికి ప్రభుత్వ కార్యాలయం అంటేనే ప్రజలకు సేవలు అందించే కార్యాలయాలని వారి ఫోన్ నెంబర్లు ,పేర్లు హోదా తెలియ పరుచుకోకుంటే వారు ఎవరి కోసం పని చేస్తున్నారని, ఆయన ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారుల తీరు మార్చుకొని, సమాచారం ఏర్పాటు చేయకపోతే, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు, కదిరె రమేష్, కొంకట చంద్రయ్య, దాట్ల రత్నాకర్, లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment