విద్యుత్ రంగం ప్రైవేటీకరణను ఆపాలి..సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏవి రమణ

*విద్యుత్ రంగం ప్రైవేటీకరణను ఆపాలి*

*సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏవి రమణ*

*రాయచోటి

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని ప్రైవేటికరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, కార్మికులకు నష్టం కలిగించే విధంగా బిజెపి ప్రభుత్వం తెచ్చిన లేబర్ కొడ్స్ ను రద్దు చేయాలనే డిమాండ్ తో ఈ నెల 9 న జరిగే అఖిల భారత సమ్మె ను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.వి.రమణ పిలుపునిచ్చారు.గురువారం ఆయన స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ కార్మికులతో సమ్మెకు సంబంధించిన గోడ పత్రాలను విడుదల చేశారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని,పని భారం తగ్గించి,ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు.అనంతరం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిస్కమ్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు మాట్లాడుతూ జూనియర్ లైన్ మెన్ గ్రేడ్ 2 లను విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని,కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,విద్యుత్ సంస్థలను రక్షించుకుందామని,విద్యుత్ రంగంలో ప్రవేటీకరణ,కాంట్రాక్టీకరణను వ్యతిరేకించడంతో పాటు ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేటీకరణను వెంటనే ఆపాలని కోరుతూ ఈ నెల 9 న జరిగే అఖిల భారత సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు,కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యకార్యక్రమంలో విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డివిజన్ నాయకులు గజేంద్ర నాయుడు,మహబూబ్ భాష,కార్మికులు తిమ్మారెడ్డి,రమణ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment