గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలక వర్గ నిర్లక్ష్యమే కారణం

రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన మహిళ నాగుబాయ్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో మృతి

* గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలక వర్గ నిర్లక్ష్యమే కారణం

* బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్

*గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, డిసెంబర్ 29, (ప్రశ్న ఆయుధం ):*

రోడ్డు విస్తరణ పనులలో ఇల్లు కోల్పోయిన మహిళ నాగుబాయ్ మృతికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని గజ్వేల్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన గజ్వేల్ లో విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలో అభివృద్ధి పేరుతో ఏడు సంవత్సరాల కింద ఇందిరాపార్క్ నుండి కోట మైసమ్మ వరకు రోడ్డు విస్తరణ చేపట్టినా ఇప్పటివరకు పూర్తి కాకపోవడం శోచనీయం అన్నారు. నాగుబాయ్ మృతికి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్నారు. అధికారులు ఇండ్లను కూలగొట్టి అలాగే వదిలిపెట్టారని, ఇల్లు సగం కోల్పోయిన వారు అందులోనే కాలం గడుపుతున్నారని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఈ రోడ్డు పనులు ముందుకు సాగలేక పోయాయని, విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి ఇప్పటివరకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించకపోవడం వల్లనే బాధితురాలు నాగుభాయ్ అనే మహిళ చలికి వర్షానికి బలై ఓ నిండు ప్రాణం పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం బాధ్యత వహించాలని, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాని, వెంటనే డబుల్ బెడ్ రూమ్ కేటాయించాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ అసంపూర్తి పనులపై గతంలో బీజేపీ ఆధ్వర్యంలో పలుమార్లు నిరసనలు వ్యక్తం చేశామని, గత ప్రభుత్వానికి ఈ పాలకవర్గానికి చీమకుట్టినట్టు కూడా కాలేదని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా మొద్దు నిద్ర వహించక గజ్వేల్ అసంపూర్తి పనులపై దృష్టి సారించి త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు చేప్యాల వెంకట్ రెడ్డి, మడ్గురి నర్సింహా ముదిరాజ్, నాయిని సందీప్ కుమార్, మైస విజయ్, కిష్టా గౌడ్, వడ్డేపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment