మూడు ఏళ్లు కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాబోయే మూడేళ్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ బస్తిలో పుట్టి, ఈ బస్తిలో పెరిగిన వ్యక్తి నవీన్ యాదవ్ అని, నవీన్ యాదవ్ ను గెలిస్తే మీ పనులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దాకా వెళ్లి చేయిస్తాడని, ప్రతిపక్ష అభ్యర్థి గెలిస్తే ధర్నాలు, రాస్తారోకోలు మాత్రమే చేస్తారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను తన రాజకీయ ఉనికిని నిలబెట్టుకునేందుకు కేటీఆర్ వాడుకుంటున్నారని, కేసీఆర్ వారసత్వాన్ని స్వాధీనం చేసుకోవడానికే ఈ ఎన్నికల్లో దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీపై జరుగుతున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment