కొత్తపల్లిలో ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో స్వర్గీయ భారతరత్న ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించారని, “గరీబ్ హటావో” నినాదంతో పేద ప్రజలకు న్యాయం చేసిన మహానాయకురాలిగా గుర్తించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చాకలి చంద్రయ్య, యూత్ అధ్యక్షుడు లింగయ్య, నాయకులు హనుమంత రెడ్డి, ఆగం రాజు, నీరుడి నర్సింలు, ఆగం శ్రీను, రాజు గౌడ్, ఆగం మల్లేష్, కొక్కొండ సురేష్, కొక్కొండ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment