జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం: టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన అక్రెడిటేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుందని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (టీయుడబ్ల్యూజే- ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్, సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అనిల్ ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హెల్త్ కార్డులకు దిక్కులేదని, ఇక ఇళ్ల స్థలాలు అందని ద్రాక్షలా ఉన్నాయన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అనేక సార్లు కలిసి చర్చించిం దన్నారు. అంతే కాకుండా అనేక సార్లు వినతి పత్రాలను ఇచ్చిందన్నారు. కానీ గత 20నెలలుగా అక్రిడేషన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని బండారు యాదగిరి ఆరోపించారు. ఇప్పటికి కూడా పాత అక్రిడేషన్ కార్డులను పలు దఫాలుగా రెన్యూవల్ చేస్తున్నారే తప్ప, కొత్త కార్డులు ఇవ్వడం లేదని అన్నారు. ఇదేమని అడిగితే, ఇదిగో.. అదిగో అంటూ వాయిదాలు వేస్తున్నారని విమర్శించారు. అక్రిడేషన్ల జారీ ప్రక్రియ కార్యరూపం దాల్చటం లేదని యాదగిరి పేర్కొన్నారు. అందువల్ల ప్రభుత్వ సాచివేత ధోరణికి నిరసనగా డిసెంబర్ 3న ఉదయం 10గంటలకు మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మహా ధర్నాకు రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చిందని తెలిపారు. మన ధర్మాగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. జిల్లాలోని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర, జాతీయ కౌన్సిల్ సభ్యులు, వివిధ సబ్ కమిటీల సభ్యులు తప్పకుండా ఈ ధర్నాకు హాజరు కావాలని తెలిపారు. అతి ముఖ్యమైన ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా లోని ప్రతి జర్నలిస్టును కోరుతున్నామని యాదగిరి అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment