*25న వెరిఫికేషన్..!!*
హైదరాబాద్, నవంబర్ 23 : భూగర్బ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా 25న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ ప్రకటించింది.
ఉదయం 10 గంటల నుంచి నాంపల్లి టీజీపీఎస్సీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని పేర్కొన్నారు.