రోడ్లు, భవనాల శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మండల, జిల్లా కేం ద్రాల నుంచి రాజధాని హైదరాబాద్‌కు రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడంతోపాటు రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం 2024-25 బడ్జెట్‌లో ఆర్‌అండ్ బీ శాఖకు రూ.7,490కోట్లను కేటాయించగా.. ఇందులో ఔటర్ రింగు రోడ్డుకు రూ.200 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్ భూ పరిహారం వాటా కోసం రూ.1,500కోట్లను కేటాయించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం పేర్కొంది. ప్రజాపాలన- ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ఏడాది ప్రగతి నివేదికను విడుదల చేసింది.
రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ఏడాది ప్రగతి నివేదికను విడుదల
Published On: December 6, 2024 11:09 am