పరిసరాల పరిశుభ్రతపై సభ్యులకు అవగాహన..

పరిసరాల పరిశుభ్రతపై సభ్యులకు అవగాహన.

IMG 20240824 WA0116

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ హెచ్ జి సంఘ సభ్యులకు పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ అవగహన కల్పించారు మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి మహిళా ముందడుగు వేసి పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుతూ వర్షాల వల్ల నీరు నిల్వ ఉన్న చోట ప్రతి శుక్ర మంగళ వారాలలో డ్రై డే నిర్వహించి ఇంటితో చుట్టూ పక్కల ఇండ్లలో కూడా డ్రై డే చేయు విధంగా అవగాహన కల్పిచాలన్నారు.నీరు నిల్వ ఉన్న చోట దోమలు పెరిగి డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని అన్నారు వార్డులలో వచ్చే చెత్త బండికి తడి పొడి చెత్తను వేరు చేసి వాహనాలకు అందించాలన్నారు. ప్రతి సంఘ సభ్యురాలు బ్యాంకు ద్వారా అందించే రుణాలతో ఆర్ధిక ఎదుగుదలకు ఉపయోగించాలని కమీషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ రాజిరెడ్డి, సిఎల్ఆర్పీ జ్యోతి, ఆర్పీలు ఆర్షియా, షాహీనలతో పటు పలు సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now