గంగమ్మ వాగు వంతెనను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు
రోడ్డు గుంతలు వెంటనే పూడ్చి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 28
రామారెడ్డి మండల పరిధిలోని గంగమ్మ వాగు వంతెనను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. వంతెనకు అనుసంధానమైన రహదారి భాగంలో ఏర్పడిన గుంతను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో పరిస్థితులను సమీక్షించారు. వంతెన భద్రత, రహదారి పునరుద్ధరణ చర్యలపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన కలెక్టర్, రోడ్డు మరమ్మతులను అత్యవసరంగా చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రహదారి స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఆర్అండ్బీ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. మోహన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. రవితేజ, రామారెడ్డి మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ) పాల్గొన్నారు.