తెలంగాణ విలీన దినం సందర్భంగా మంగళవారం మూసాపేట మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన బండి రమేష్
ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 17: కూకట్పల్లి ప్రతినిధి
నాటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢచిత్తంతోనే రజాకార్ల పాలన అంతమై తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయులు పీల్చుకోగలిగారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, అన్నారు. తెలంగాణ విలీన దినం సందర్భంగా మంగళవారం మూసాపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన జాతీయ జెండాని ఎగరవేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా తెలంగాణ విలీన దినోత్సవాన్నిహైదరాబాద్ విలీనదినం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పాలన దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకం ప్రతి సంవత్సరం నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి , బీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు , తూమ సంతోష్ , ప్రకాష్ ,శివ చౌదరి, బచ్చుమల్లి తదితరులు పాల్గొన్నారు.