అస్తవ్యస్తంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో నిర్వహణ ..

అస్తవ్యస్తంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో నిర్వహణ 

IMG 20240917 WA0044 1

IMG 20240917 WA0043 1

 

పేద, మధ్యతరగతి ప్రజలకు అందని వైద్యం ప్రైవేటు వైపే ఆసక్తి చూపిస్తున్న డాక్టర్లు పేరుకే ఇక్కడ విధులు పనులన్నీ అక్కడే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న చందంగా మారింది బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి దుస్థితి. గతంలో ఈ ఆసుపత్రి ఎన్నో అవార్డును అందుకోగా ప్రస్తుతం పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం అందించలేక పోతుంది. ఇక్కడ విధులు నిర్వహించే వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రి కంటే ప్రైవేట్ ఆసుపత్రికి ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా అత్యవసరం ఉంటే, డెలివరులు ఉంటే నిజాంబాద్ రిఫర్ చేస్తూ ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదని తెలుస్తుంది. అత్తా అదునుక పరికరాలు కావలసిన గదులు అన్నీ ఉన్న ఇక్కడ ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యుల నిర్లక్ష్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ప్రథమ చికిత్సలకే పెద్ద ఆసుపత్రి పరిమితం అవుతుందని ఆరోపణలు వినబడుస్తున్నాయి. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఆసుపత్రికి రోగులు, గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు వస్తుండగా వారికి సరైన వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రి వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. ఇక్కడ సూపరిండెంట్ సమయానికి అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు సైతం ఉన్నాయి. దీంతో వైద్యులు సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా విధులు నిర్వహిస్తున్నారని సమాచారం. వైద్యం అందించిన అందించకుండా నెల నెల వేతనాలు వస్తాయని ధీమాతో ఏదో మొక్కుబడిగా పనులు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఏరియా ఆసుపత్రి పాత భవనాన్ని తొలగించడంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్వహణకు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి పక్కనే కొనసాగిస్తుండడంతో రద్దీ మరింతగా పెరిగినట్లు కనిపిస్తుంది. ఎంతో ఆశతో సర్కారు వైద్యం కోసం వస్తున్న వారికి నిరాశే మిగులుతుందని ఇక్కడ విధులు నిర్వహించే వైద్యులు సక్రమంగా పనులు చేయడం లేదని తెలుస్తుంది ఇదిలా ఉండగా రాత్రి వేళలో సైతం ఏ ఒక్క వైద్యుడు సైకో కూడా అందుబాటులో ఉండడం లేదని దీంతో అంబులెన్స్లకు పంటగా మారుతుందని సమాచారం ఏది ఉన్న పేరుకే బాన్సువాడలో పెద్ద ఆసుపత్రి ఉందని అంతా నిజాంబాద్ రిఫర్లకు పరిమితం అవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అసలు ఆసుపత్రిలో ఏం జరుగుతుంది పేద మధ్యతరగతి వారికి సరైన వైద్యం అందుతుందా లేదా అని పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేద మధ్యతరగతి వారికి సరైన వైద్యం అందేలా చూడాలని బాన్సువాడ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

Join WhatsApp

Join Now