*:ఇందిరమ్మ ఇండ్లు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రజలందరూ సకాలంలో సహకరించాలి::-*
*కాంగ్రెస్ నాయకులు గడ్డి శ్రీనివాస్*
*:ఇల్లందకుంట డిసెంబర్ 19 ప్రశ్న ఆయుధం:*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇల్లు లేని బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమంలో భాగంగా డిజిటల్ పద్ధతిలో అర్హుల పేర్ల వివరాలను పొందుపరచడం జరుగుతుందని ఈ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శి కి అప్పగించడం జరిగిందని. ఇండ్ల నిర్మాణానికి దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఈనెల 31 లోపు వారి యొక్క వివరాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలని కోరుతున్నాము అదేవిధంగా చిన్న గ్రామపంచాయతీల పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది కాబట్టి చిన్న గ్రామం పంచాయతీ జనాలు తొందరగా వారి వివరాలను పొందుపరచగలరని పంచాయతీ సెక్రటరీలకు సహకరించగలరని కోరుతున్నాం అని అన్నారు