వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి 

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ శుక్రవారం మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డి మండలంలోని గండి మాసానిపేట గ్రామానికి చెందిన మాలకాని శాంతమ్మ ( 52 ) ఎడమ కాలు నడుము వద్ద విరగడంతో శనివారం మెడికేర్ ఆసుపత్రికి కుటుంబీకులు తీసుకువచ్చారు. ఆమె కుమారుడు తెలిపిన విరాళ ప్రకారం ఆమెకు షుగర్ ఉందని దాన్ని కంట్రోల్ చేస్తూ, మెడికేర్ వైద్యులు ఆరోగ్యశ్రీ అనుమతి కోసం గురువారం వరకు ఎదురు చేసి గురువారం మధ్యాహ్నం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లి ఆపరేషన్ చేసేందుకు సిద్ధం కాగా ఆమెకు గుండె నొప్పి రావడంతో సి పి ఆర్ చేస్తుండగా గుండెపై ఉన్న ఎముక విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను వెంటనే వైద్యులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎమర్జెన్సీ వార్డులోకి మార్చారని తెలిపారు. శాంతమ్మ కుమారుడు ప్రభాకర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి అనుమానం వచ్చి తెలిసిన వైద్యుని పిలిపించగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందిందని ఆయన చెప్పడంతో తాము ఆందోళనకు గురి అయ్యేమన్నారు. ఆమెకు గుండె నొప్పి వచ్చిన సమయంలోనే తమకు తెలిపినట్లైతే వేరే ఆసుపత్రికి తరలించి, మరో రకంగా నైనా తాము అప్రమత్తమై ఆమెను బతికించుకునే వారమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now