సంగారెడ్డి, జూలై 16
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, స్వామినాధన్ సిఫార్సులను అమలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి జయరాజు డిమాండ్ చేశారు. కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఆయన కోరారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, స్వామినాధన్ సిఫార్సులు అమలు చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి జయరాజు అన్నారు. గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వీబీ గ్రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ పాత చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ప్రభుత్వం కొత్తగా తెచ్చిన విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు.
రైతులు, కార్మికులు, కూలీలకు వ్యతిరేకంగా తెస్తున్న విధానాలకు నిరసనగా ఆగష్టు 10న 'జైల్ భరో' కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతులు, కార్మికులు, కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు యన్ శ్రీనివాస్, నాయకులు యాదగౌడ్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.












