సంగారెడ్డి/పటాన్ చెరు, ఏప్రిల్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. సోమవారం అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని గుమ్మడిదల బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి తదితరులు రక్తదానం చేశారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి మెమొంటో అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు తుడుం రవి, ఉపాధ్యక్షుడు డప్పు శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ తుడుం రాజు, సభ్యులు రాజు, రమేష్, ఆంజనేయులు, టి.రాజు, సుధాకర్, భాస్కర్, శ్రీనివాస్, పల్లె రమేష్, బాలేష్, కొత్తపల్లి రమేష్, హెల్త్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రవీందర్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని సన్మానించిన అంబేద్కర్ సంఘం నాయకులు
Published On: April 14, 2025 2:30 pm
