జలాల్ పూర్ లో భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమం

*జలాల్ పూర్ లో భూసార పరీక్షలపై అవగాహన కార్యక్రమం*

ప్రశ్న ఆయుధం బాల్కొండ డిసెంబర్ 21:మండలంలోని జలాల్పూర్ గ్రామంలో సరైన పంట దిగుబడులు సాధించడం కొరకు రైతులు తప్పనిసరిగా నేల ఆరోగ్యం పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని బాల్కొండ వ్యవసాయ విస్తరణ అధికారిని రేష్మ తెలిపారు. శనివారం జలాల్పూర్ లో రైతులకు భూసార పరీక్షల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ సరైన నేలలో, నాణ్యమైన విత్తనం వేయడంతో పాటుగా సరైన మోతాదులో పోషకాలను మొక్కలకు అందించినప్పుడే మంచి దిగుబడి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ పథకంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు 100% ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో భాగంగా రైతులు తమ పంట పొలాల నుండి 100 గ్రాముల మట్టి నమూనాలను వ్యవసాయ శాఖకు సమర్పించినట్లయితే ఆ నేలలో ఉండే నత్రజని, భాస్వరం, పొటాష్ లభ్యతతోపాటుగా ఉదజని సూచిక తదితర వివరాలతో కూడిన మట్టి పరీక్ష కార్డులు రైతులకు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు మోహన్ రెడ్డి, దేవేందర్, గంగాధర్, గుండేటి కిషన్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now