Site icon PRASHNA AYUDHAM

ఇందిరమ్మ ఇళ్ల మార్క్‌ఔట్ పనులు వేగవంతం చేయాలని సీఈఓ చందర్ ఆదేశం

IMG 20251113 225909

ఇందిరమ్మ ఇళ్ల మార్క్‌ఔట్ పనులు వేగవంతం చేయాలని సీఈఓ చందర్ ఆదేశం

గాంధారి మండలంలోని గ్రామాల్లో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించిన జడ్పీ సీఈఓ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 13 

జిల్లా జడ్పీ సీఈఓ చందర్ గురువారం గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో ఇందిరమ్మ హౌసింగ్ మార్క్‌ఔట్ పనులను స్వయంగా పరిశీలించారు. మడుగు తాండ, గాంధారి గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్ల వద్ద మార్క్‌ఔట్ వేయించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఐకేపీ, ఈజీఎస్‌ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి ప్రతి లబ్ధిదారుని ఇంటికి మార్క్‌ఔట్ పూర్తిచేసి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పనుల్లో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్, ఏపీఎం ప్రసన్న కుమార్, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version