సంగారెడ్డి/పటాన్ చెరు, ఏప్రిల్ 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పలువురు యువకులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి స్వయంగా రక్తదానం చేసి మిగతా వారికి స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ చూపిన మార్గం మన సమాజానికి వెలుగునిస్తుందని అన్నారు. సమానత్వం, సాంఘిక న్యాయం కోసం ఆయన పోరాటాన్ని ఈ తరం గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో సామాజిక బాధ్యతాభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.