సంగారెడ్డి, జూలై 6
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యారెక్స్ పరిశుభ్రతను పరిశీలించి, ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించడానికి పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించి, కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాలు, సిబ్బంది బ్యారెక్స్ పరిశుభ్రతను పరిశీలించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించగలమని, ప్రతి సిబ్బంది పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సూచించారు.
అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలిస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక (ప్లాన్ ఆఫ్ యాక్షన్) రూపొందించుకోవాలని సూచించారు.
స్టేషన్ పరిధిలో అధిక ఆర్ధిక నేరాలు జరుగుతున్న ప్రాంతాలను క్రైమ్ ప్రోన్ ఏరియాగా గుర్తించి, నిఘా పెంచాలని అన్నారు. తరచూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానిత వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని సూచించారు.
పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, కేడీలు, అనుమానిత వ్యక్తుల వివరాలు ప్రతి సిబ్బందికి అవగాహనలో ఉండాలని, పగలు-రాత్రి బీట్లలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తూ, ఆన్లైన్ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు.
మన చుట్టూ జరుగుతున్న వివిధ రకాల నేరాలు, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్‌హెచ్‌వోకు సూచించారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, వారి సమస్యలను ఓపికగా విని, వారి సమస్యకు పరిష్కారం చూపుతామన్న భరోసా వారిలో కల్పించాలని అన్నారు.
అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి, సూచిక బోర్డు లను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్లాక్ స్పాట్ అయినా నిజాంపేట చౌరస్తాను సందర్శించి, రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో సదాశివపేట ఎస్‌హెచ్‌వో డి.వెంకటేశ్, ఇన్స్పెక్టర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












