సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలోని పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… పరిశ్రమల్లో పనిచేసే ప్రతి కార్మికుడి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని పరిశ్రమల యజమానులు తమ పరిశ్రమలలో ప్రమాదాలు జరగకుండా అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పరిశ్రమలలో పారిశ్రామిక మ్యాప్, సిబ్బంది పేర్లు, సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని క్లస్టర్ సేఫ్టీ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో డిసిఎల్ రవీందర్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు జిల్లా పరిశ్రమల కేంద్రం అధికారులు పాల్గొన్నారు.
ప్రమాదాలు జరగకుండా పరిశ్రమల యజమాన్యం భద్రతా చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Published On: October 31, 2025 9:34 pm