ఆక్సిజన్ కాన్సెంట్రేట్లను అందజేసిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 2.
దోమకొండ పోర్టు ట్రస్ట్ వారి సహకారంతో వైద్య ఆరోగ్యశాఖకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్ వాన్.
శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ దోమకొండ ఫోర్ట్ ట్రస్ట్ ద్వారా జిల్లా వైద్య
మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం పరిధిలో గల దేవన్పల్లి, బిబిపేట, భిక్నూర్, లింగంపేట, రామరెడ్డి, నాగిరెడ్డిపేట మరియు నస్రుల్లాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రలకు ఆక్సిజన్ కాన్సెంట్రేట్లను ఆయా ఆసుపత్రుల వైద్య అధికారులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఆసుపత్రిలో చాలా ఉపయోగకరంగా ఉంటాయని, కరోనా సమయంలో అనేకమంది కరోనా పేషంట్ల ప్రాణాలను రక్షించడంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ విలువ 66 వేల రూపాయల పైగా ఉంటుందని వీటిని జిల్లాలోని ఏడు పీహెచ్సీలకు ఉచితంగా అందించినందుకు దోమకొండ కోర్టు ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోతున్న చలికాలంను దృష్టిలో ఉంచుకొని వైద్య అధికారులు అందరూ ఈ ఆక్సిజన్ కాన్సెంట్రేట్లను ఉపయోగించుకొని ప్రజలకు సేవలను అందజేయాలని సూచించారు. అలాగే రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని కలెక్టర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో దోమకొండ ఫోర్ట్ అధికారులు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్, మరియు జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభు కిరణ్ , డాక్టర్ విద్య మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు పాల్గొన్నారు.