వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వద్దు.

సిద్దిపేట జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్ప రవికుమార్

సిద్దిపేట సెప్టెంబర్ 18 ప్రశ్న ఆయుధం :

సిద్దిపేట అర్బన్ :- తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బోర్డు అడైంట్ కమిటీని నియమించి నిధులు దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమ కోసమే ఖద్చు చేయాలన్నారు.

సిద్దిపేట జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (BCWU -CITU) వర్క్ ర్స్ ఫెడరేషన్ సేంటీయూ) ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ
సందర్భంగా చొప్పరి రవికుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికిపైగా
భవన, ఇతర నిర్మాణరంగ కార్మికులు నీ4 వృత్తుల్లో పనులు చేస్తున్నారని, వీరంతా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన పేదలని అన్నారు. 2009 నుంచి భవన నిర్మాణ కార్మికులకు 11 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు 6 లక్షల రూపాయలు, సహజ మరణానికి రూ.1.30లక్షలు, వివాహ, ప్రసూతి కానుకగా రూ.30వేల చొప్పున గాయాలపాలైన సందర్భంలో నష్టపరిహారాలు అందజేస్తున్నారని గుర్తుచేశారు. అయితే, ఈ కేంద్ర చట్టంలో ఉన్న పెన్షన్, పిల్లలకు స్కాలర్షిప్, గృహ వసతి, అద్దాలలో మౌలిక సౌకర్యాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి కొత్త సంక్షేము పథకాలు ప్రవేశపెట్టడంలో.. ఉన్న సంక్షేమ పథకాలకు నిధులు పెంచడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా.. దారి మళ్లించిందని, వెల్ఫేర్ బోర్డు అధైరీ కమిటీని నియమించకుండా ఇష్టారాజ్యంగా దుబారా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణరంగం కార్మికులంటే 15 లక్షల మందిని మాత్రమే రెన్యువల్ చేసి, మిగతా 10 లక్షల మంది కార్మికులకు సంక్షేమ పధకాలు వర్ణించకుండా అన్యాయచేస్తోంది బెందర్ పొడుకున్న కంపెనీలు చిన్న చిన్న. కారణాలు చూపి కార్మికులకు నష్టపరిహారాలు అందకుండా చేసే ప్రమాదం ఉందని, ఇదంటి కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చే ముందు కార్మిక సంఘాల నాయకులతో, మేధావులతో, అనుభవం కలిగిన నిపుణులతో చర్చించాలని డిమాండ్ చేశారు. 1996 చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు ద్వారానే నిధులను కార్మికులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోతిరెడ్డి రాజు, నాగరాజు, జిల్లా కమిటీ సభ్యులు కనక స్వామి, బాల నరసయ్య, బాలకిషన్, మల్లేశం, రాజశేఖర్, లక్ష్మి, కాంతమ్మ,వినోద, రేణుక, ఎల్లమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment