నిజామాబాద్, July 14
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బీసీ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బీసీ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు.
ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నవాతే ప్రతాప్ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో దీక్షా శిబిరానికి తరలివెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు ఆర్. కృష్ణయ్యకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నవాతే ప్రతాప్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.8 వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వాటి విడుదల కోసం నిరంతరం ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
గత జూన్ 30న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర బంద్ సందర్భంగా ప్రభుత్వం రూ.1,000 కోట్లు ఈ నెల 15న విడుదల చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. మిగిలిన రూ.7 వేల కోట్ల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువతను ఏకతాటిపైకి తెచ్చి మరింత ఉద్ధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గంగాధర్, శేఖర్, జనార్ధన్, విశ్వక్సేన్ తదితరులు పాల్గొన్నారు.












