సంగారెడ్డి, జూలై 27
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ బాలుర ఆనంద నిలయం వసతి గృహాన్ని ఏఎస్సీడీఓ శ్రీ బానోత్ శంకర్, స్థానిక 17వ వార్డు కౌన్సిలర్ జి.జ్యోతి రాజుతో కలిసి సోమవారం సందర్శించారు. వసతి గృహ పరిసరాలు, పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న భోజనం తదితర సౌకర్యాలను వారు పరిశీలించారు.
సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ బాలుర ఆనంద నిలయం వసతి గృహాన్ని ఏఎస్సీడీఓ శ్రీ బానోత్ శంకర్, స్థానిక 17వ వార్డు కౌన్సిలర్ జి.జ్యోతి రాజుతో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వసతి గృహ పరిసరాలు, పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న భోజనం తదితర సౌకర్యాలను పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో బానోత్ శంకర్ మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించి, వసతి గృహానికి, తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. వార్డ్ కౌన్సిలర్ జి. జ్యోతి రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న ట్రంక్ బాక్సులు, నోటు పుస్తకాలను జాగ్రత్తగా ఉపయోగించాలని, ఇవి మీ చదువుకు తోడ్పడే సాధనాలు అని అన్నారు. ప్రభుత్వం మీ భవిష్యత్తు కోసం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన ట్రంక్ బాక్సులు, నోటు పుస్తకాలను, ప్లేట్లు, గ్లాసులను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమ అధికారి జి. నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.












