వెల్ నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హనుమాన్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): వెల్ నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి మున్సిపాలిటీ 3వ వార్డు హనుమాన్ నగర్ లో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అంబేద్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండాపురం జగన్ విచ్చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించి పేదలకు రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండాపురం జగన్ మాట్లాడుతూ.. వెల్ నెస్ ఆసుపత్రి వారు పేదల కోసం ఇలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. అదే విధంగా ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం ఇస్తుండడం సమాజానికి ఒక మార్పు తెచ్చే విధంగా చూడడం సంతోషకరమని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించాలని జగన్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రఫీ, మున్సిపల్ కౌన్సిలర్ విష్ణు, వైద్య సిబ్బంది శివరామకృష్ణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment