Dr. B.R. Ambedkar Konaseema/I. Polavaram (ప్రశ్న ఆయుధం) జూలై 04
మానవత్వంతో రక్తదానం చేయాలని, రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు పిలుపునిచ్చారు. తలసేమియా వ్యాధిగ్రస్తులైన చిన్నారులను కాపాడుకోవాలని ఆయన అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లిలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 40 మంది రక్తదానం చేశారు.
రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని, మానవత్వంతో రక్తదానానికి ముందుకు రావాలని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అన్నారు. తలసేమియా వ్యాధి అవగాహన కరపత్రాలను ఆవిష్కరించారు.
కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, గ్రామ యువకులు 40 మంది రక్తదానం చేశారని డాక్టర్ బాలు తెలిపారు.
గ్రామంలో మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, దక్షిణ ప్రాంగణం ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ గౌడ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అంజయ్య, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, యువజన సంఘాలకు రెడ్ క్రాస్ తరఫున అభినందనలు తెలిపారు.
ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు తమను సంప్రదిస్తే వారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నారాయణ, డాక్టర్ హరిత, డాక్టర్ సరిత, డాక్టర్ ప్రతిజ్ఞ, డాక్టర్ నాగరాజు, డాక్టర్ మోహన్ బాబు, డాక్టర్ సబిత, డాక్టర్ సంతోష్ గౌడ్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.












