హత్నూరా, జూన్ 28
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచ్ శ్రీహరి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరి అని ఆయన సూచించారు.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో ఆదివారం సర్పంచ్ శ్రీహరి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. పోలియో మహమ్మారి నుండి చిన్నారులను సంపూర్ణంగా రక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
పోలియో కేంద్రాలలో చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏదైనా కారణాల చేత ఈ రోజు పోలియో చుక్కలు వేయించకపోతే తల్లి తండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తదుపరి 29, 30 తేదీలలో వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారన్నారు.
ప్రతి ఐదు సంవత్సరాల చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










