సదాశివపేట, జూన్ 28
సదాశివపేట మున్సిపాలిటి 12వ వార్డులో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం అంగన్వాడీ పాతకేరి–1 కేంద్రంలో ఘనంగా జరిగింది. 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సదాశివపేట మున్సిపాలిటి 12వ వార్డులో ఆదివారం నాడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ పాతకేరి–1 కేంద్రంలో ఆశావర్కర్ కరదాస్ లావణ్యలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పులిమామిడి మమత మాట్లాడుతూ 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తల్లితండ్రులు సువర్ణ, శివలీల, జయమ్మ, నర్సింలు, అఖిల్, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.









