ఎల్ఈడీ ప్రదర్శనతో హెచ్ఐవి పై అవగాహన
ప్రశ్న ఆయుధం,బీబీపేట,
రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పరిధిపేట్, మాందాపూర్ లలో ఎల్ఈడి చిత్ర ప్రదర్శనతో హెచ్ఐవీ, సుఖ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఐవీ, సుఖ వ్యాధుల నివారణ జాగ్రత్తలను వివరించారు. ఆయా వ్యాధులపై సేవలు అందించే కేంద్రాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వై ఆర్ జి కేర్ లింకు వర్కర్ బాలకిషన్, స్థానికులు, యువకులు పాల్గొన్నారు.