ఆస్కార్ స్థాయి రాజకీయ నటన కౌశిక్ రెడ్డిది – ప్రణవ్

*ఆస్కార్ స్థాయి రాజకీయ నటన కౌశిక్ రెడ్డిది-ప్రణవ్*

*దళిత బంధు రెండవ విడత ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే*

*రాజకీయ పబ్బం గడుపుకోవడానికే కౌశిక్ డ్రామాలు*

*హుజురాబాద్ నవంబర్ 9 ప్రశ్న ఆయుధం::-*

తన రాజకీయ స్వలాభం కోసం దళితులను అడ్డుపెట్టుకొని కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడని,ఎమ్మెల్యేగా అతను శనివారం ప్రవర్తించిన తీరు రాజకీయాల్లో దిగజారుడుతనానికి నిదర్శనమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దరఖాస్తు స్వీకరణతో పేరుతో పక్కా పథకం ప్రకారం డ్రామా ఆడాడని,రెండవ విడత దళిత బంధు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని దళిత బంధు రావడానికి ప్రభుత్వ పెద్దలతో ఇప్పటికే అనేకమార్లు సంప్రదింపులు చేశామని,దళితుల జోలికి వస్తే ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు.భారాసా పార్టీ వారు నడుపుతున్న డ్రామా కంపెనీలో కౌశిక్ రెడ్డికి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని,రెండేళ్ల పాటు ఎమ్మెల్సీ,విప్ గా అధికారంలో ఉండి దళిత బంధు ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్నకు ఇప్పటికి సమాధానం లేదని అన్నారు.ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి పోలీస్ అధికారుల పట్ల వ్యవహరించిన తీరు బాధాకరమని ఇలాంటి చిల్లర వేషాలు వేసి హుజురాబాద్ ప్రజల గౌరవాన్ని తగ్గిస్తున్నాడని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి,టిపిసిసి ఎస్సీ సెల్ అట్రాసిటీ రాష్ర్టఇంఛార్జి తిప్పారపు సంపత్,కొలుగురి కిరణ్,సంధమల్ల బాబు లావణ్య పూదరి రేణుక పర్లపల్లి నాగరాజు సుంకరి రమేష్ ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు,మిడిదొడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now