*శిక్షణతో పాటు ఉచితంగా కాటమయ్యకిట్ల పంపిణీ.*
సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 6 (ప్రశ్న ఆయుధం న్యూస్): కుల వృత్తులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని,రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహలు అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా వెనుక బడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గీత కార్మికులకు కాటమయ్య కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించి, జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ పరిధిలో *60* కాటమయ్య కిట్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టీఎస్ఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయ గీతా కార్మికులు ప్రమాదాల బారిన పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అలాంటిది ఇంకా ముందు జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వం వెనుక బడిన తరగతుల శాఖ తరపున గీత కార్మికులకు శిక్షణ అందించడంతో పాటు ఉచితంగా కాటమయ్య కిట్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ కాటమయ్య కిట్లు గీత కార్మికులకు ఆత్మస్థైర్యం ఇస్తాయన్నారు. ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతాయి అన్నారు. బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగడం కోసం తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కుటుంబ సర్వే వల్ల రాష్ట్రంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజల ఆర్థిక సామాజిక పరిస్థితి ప్రభుత్వానికి తెలుస్తుందని దానికి అనుగుణంగా ప్రభుత్వం వారి సంక్షేమం కోసం బతకాలు చేపట్టి వారి ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయునట్లు తెలిపారు. అత్యంత పురాతన వృత్తి ఆయన గీత కార్మిక వృత్తిని ప్రోత్సహించడం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గీత వృత్తిలో చెట్లపైనుండి పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఎంతోమంది శాశ్వత అంగవైకల్యం పొందారని అలాంటి సంఘటనలు ఇక ముందు పునరావృతం కాకుండా ఉండటం కోసం ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ ల తరపున గీత కార్మికులకు శిక్షణ ఇచ్చి కాటమయ్య కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ గ్రామాలకు చెందిన గీత కార్మిక సహకార సంఘాలు గీత కార్మిక సంఘాలు ద్వారా ఈత కళ్ళు, నీరా, తాటికల్లు అమ్ముతూ సుమారు 3500 గీత కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని వారి కుటుంబాలను వెలుగుల నింపడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. గత పది సంవత్సరాలలో గీత కార్మికులు ప్రమాదాల బారిన పడి సుమారు 750 మంది వరకు చనిపోయినట్లు అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కాటమయ్యకిట్లు ఉపయోగపడతాయన్నారు. అంతరించిపోతున్న కులవృత్తులను ప్రోత్సహించి ఆధునిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నీరా విక్రయ కేంద్రాలను ప్రభుత్వం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నీరా విక్రయం కేంద్రాలను ప్రోత్సహించడం ద్వారా గీత కార్మికుల కుటుంబాలలో వెలుగులు నింపడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా వెనకబడిన తరగతుల అధికారి జగదీష్, జిల్లా ఎక్ససైజ్ సూపరిండెంట్ నవీన్ చంద్, జిల్లా కల్లు గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆశన్న గౌడ్, కార్యదర్శి రమేష్ గౌడ్, గౌడ సంఘం నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.