రేపు తెలంగాణలో మద్యం దుకాణాలు బంద్

హైదరాబాద్, మార్చి 13 (ప్రశ్న ఆయుధం న్యూస్): మద్యం ప్రియులకు బాధాకరమైన వార్త ఏమి టంటే..? రంగుల హోలీ సందర్భంగా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయం త్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని పోలీస్‌ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హోలీ రోజు బలవంతంగా రంగులు చల్లడం, రహదారులపై ప్రజలను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, హోలీ సందర్భంగా బీఫ్‌ దుకాణాలను సైతం ఆ రోజు మూసి వేయాలని నిర్వాహకులను బల్దియా అధికారులు ఆదేశించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్ప వని పోలీస్ శాఖ వెల్లడించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment