భారత సైన్యానికి చెందిన మహిళా మేజర్ అభిలాషా బరాక్కు ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక '2025 UN మిలిటరీ జెండర్ అడ్వకేట్ అవార్డు'ను ప్రకటించింది. లెబనాన్లో UN ఇంటర్మ్ ఫోర్స్లో సేవలందిస్తున్న ఆమె, మహిళలు, బాలికల సాధికారత కోసం చేసిన కృషికి ఈ గౌరవం లభించింది.
మేజర్ అభిలాషా బరాక్, UNIFILలో పనిచేస్తూ లింగ సమానత్వం, మహిళల హక్కుల పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. క్షేత్రస్థాయిలో మహిళా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషించారు.
ఈ అవార్డును అందుకున్న మూడో భారతీయురాలిగా మేజర్ బరాక్ చరిత్ర సృష్టించారు. అంతకుముందు మేజర్ సుమన్ గవానీ, మేజర్ రాధికా సేన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది భారత సైన్యంలో మహిళల పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనం.
మేజర్ బరాక్ సేవలు అంతర్జాతీయ శాంతి పరిరక్షణ కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే కాకుండా, భారతదేశానికి గర్వకారణంగా నిలిచాయి. ఈ పురస్కారం ఆమె అంకితభావానికి, నిబద్ధతకు దక్కిన గుర్తింపు.











