ఛత్తీస్‌గఢ్‌లోని నార్త్ బస్తర్ కోయిల్ బేడ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టగా, కాల్పులు చోటుచేసుకున్నాయి.
కాంకెర్ ఎస్పీ నిఖిల్ రఖేచా తెలిపిన వివరాల ప్రకారం, నిన్న సాయంత్రం అనుమానిత ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టగానే మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు.
ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మావోయిస్టులు తప్పించుకున్నారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
'ఆపరేషన్ కగార్' కారణంగా మావోయిస్టు పార్టీ వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన తాజా ఎన్కౌంటర్ ప్రాధాన్యతను సంతరించుకుంది.
సంఘటనా స్థలం నుంచి మరిన్ని వివరాలు సేకరించే పనిలో భద్రతా దళాలు నిమగ్నమై ఉన్నాయి. ఎన్కౌంటర్లో ఎవరికైనా గాయాలయ్యాయా అనే దానిపై అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

