ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనేందుకు కోల్‌కతా వెళ్లనున్నారు. ఈ పర్యటన నేడు జరగనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 7:05 గంటలకు విజయవాడ నుండి ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు బయలుదేరనున్నారు. ఉదయం 9:20 గంటలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు.
విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని, ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.
ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత, ముఖ్యమంత్రి మధ్యాహ్నం 1:45 గంటలకు కోల్‌కతా నుండి తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 3:45 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
బేగంపేట విమానాశ్రయం నుండి నేరుగా తన జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుంటారు. ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.







