సంగారెడ్డి, జూన్ 27
హైదరాబాద్హైదరాబాద్ హైదరాబాద్ మెట్రోరైలుఫేజ్–2నుమియాపూర్నుండిపటాన్చెరుమీదుగాఇస్నాపూర్మున్సిపాలిటీవరకువిస్తరించాలనిమాజీఎమ్మెల్యేసత్యనారాయణకేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వినతివిస్తరించాలి:కేంద్రమంత్రివిస్తరించాలి:కేంద్రమంత్రిపత్రంఅందజేశారు.ఈప్రతిపాదనకురాష్ట్రప్రభుత్వంకూడాఆమోదంతెలిపేలాఒత్తిడితేవాలనికోరారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్–2ను మియాపూర్ నుండి పటాన్చెరు మీదుగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ వరకు విస్తరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి శనివారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించడం స్వాగతించదగ్గ విషయమని, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం సాధించి మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం లభించేలా చేసిన కృషిలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు.
గతంలో మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హయాంలో మియాపూర్–పటాన్చెరు–ఇస్నాపూర్ వరకు మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఫేజ్–2లో ఈ మార్గాన్ని ఐక్రిసాట్ వరకు మాత్రమే ప్రతిపాదించడం వల్ల పటాన్చెరు పట్టణం, ఇస్నాపూర్ మున్సిపాలిటీతో పాటు పరిసర ప్రాంతాల ప్రజల అవసరాలు పూర్తి స్థాయిలో నెరవేరే అవకాశం ఉండదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పటాన్చెరు–పాశమైలారం పారిశ్రామిక ప్రాంతం, ఐఐటీ హైదరాబాద్, గీతం యూనివర్సిటీతో పాటు అనేక విద్యాసంస్థలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని మియాపూర్–పటాన్చెరు–ఇస్నాపూర్ మెట్రో కారిడార్ అత్యంత అవసరమని వివరించారు. ఈ మెట్రో మార్గం అమలులోకి వస్తే వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే సంగారెడ్డి, జహీరాబాద్ మరియు పొరుగు కర్ణాటక ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని, జాతీయ రహదారి–65పై ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు కాలుష్యం తగ్గి ప్రజా రవాణా మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
ప్రజల అవసరాలు, పారిశ్రామికాభివృద్ధి, విద్యార్థులు మరియు ఉద్యోగుల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మియాపూర్–పటాన్చెరు మీదుగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ వరకు మెట్రో మార్గాన్ని ప్రతిపాదించి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మార్గాన్ని హైదరాబాద్ మెట్రో ఫేజ్–2లో చేర్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి తగిన ఒత్తిడి తీసుకురావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కోరారు.












