నిజామాబాద్, July 8
ముగ్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమ్రాబాద్ గ్రామంలోని కొక్క్యా నాయక్ తండాకు చెందిన బానోతు హరి (50) మృతిపై అతని బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
ముగ్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ఆమ్రాబాద్ గ్రామంలోని కొక్క్యా నాయక్ తండాకు చెందిన బానోతు హరి (50) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువు బానోతు పవన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్పాల్ పోలీస్ స్టేషన్లో క్రైం నెం.102/2026గా, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1)తో పాటు 3(5) కింద కేసు నమోదు చేశారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బానోతు హరి మద్యం సేవించి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగిన అనంతరం మృతి చెందినట్లు తెలిసింది. అయితే మృతదేహాన్ని పరిశీలించిన సమయంలో గొంతు వద్ద గాయాల గుర్తులు కనిపించడంతో కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవడంతో ఫిర్యాదు నమోదు అయింది.
ఈ మేరకు మృతుడి భార్య మీరాబాయి, కుమారుడు సురేష్, కోడలు రజిత, కోడలి తమ్ముడు వెంకటేష్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధారాలు సేకరిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి నిర్ధారణ కాని సమాచారం లేదా వదంతులను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.











