హైదరాబాద్‌లో ఇటీవల ముగిసిన రాష్ట్రస్థాయి తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్ (T-MUN) కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, మొత్తం ఆరు రాష్ట్రస్థాయి అవార్డులను గెలుచుకున్నారు.
రాజేంద్రనగర్‌లో మూడు రోజులపాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో, జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు UNDP కమిటీ, ఇంటర్నేషనల్ ప్రెస్ కమిటీ వంటి విభాగాలలో తమ మేధో సంపత్తిని ప్రదర్శించారు.
UNDP కమిటీలో హై కమాండేషన్ అవార్డులను అనమికరాయ్ (జడ్పీహెచ్ఎస్ దౌల్తాబాద్) మరియు కార్తికేయ చారి (జడ్పీహెచ్ఎస్ నందికంది) అందుకున్నారు. ఇదే కమిటీలో ఆరాధ్య (జడ్పీహెచ్ఎస్ చర్య), హరి ప్రకాష్ (జడ్పీహెచ్ఎస్ సిరిపుర), రిషి అరుణ్ వర్ధన్ (టీజీడబ్ల్యూఆర్ఎస్ సింగూరు) స్పెషల్ మెన్షన్ ప్రైజ్‌లను సాధించారు.
ఇంటర్నేషనల్ ప్రెస్ కమిటీలో జిక్రా మహిన్ (జడ్పీహెచ్ఎస్ న్యాల్కల్) స్పెషల్ మెన్షన్ ప్రైజ్‌ను కైవసం చేసుకున్నారు. ఈ విజయాలు జిల్లా విద్యా వ్యవస్థకు గర్వకారణంగా నిలిచాయి. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసిన రామ్‌రెడ్డి, నారాయణమ్మ, సంగమేశ్వర్, కవిత వంటి గైడ్ టీచర్ల కృషిని అభినందించారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా విద్యాధికారి ఎస్.వెంకటేశ్వర్లు అవార్డులు సాధించిన విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందిస్తూ, వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.










