రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి సోమవారం ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, మరియు సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని ఆయన అన్నారు. మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారం తీసుకోవాలని కూడా సూచించారు.
పెండింగ్లో ఉన్న ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నారని తెలిపారు.












