నిజామాబాద్, July 21
ప్రజా సమస్యలపై పాటలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన అరుణోదయ నాగన్నకు నివాళులర్పించేందుకు ఈ నెల 25న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంతాప సభ నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్లో సంతాప సభ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ నెల 25న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న అరుణోదయ నాగన్న సంతాప సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంతాప సభ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అరుణోదయ నాగన్న ప్రజా సమస్యలపై సుదీర్ఘకాలం పాటు పాటలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకు ఆయన గొంతుక విశేష బలాన్నిచ్చిందని, జీవితాంతం ప్రజల పక్షాన నిలిచిన వ్యక్తిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. సంతాప సభలో ఆయన సాహిత్యం, ప్రజా ఉద్యమాలకు చేసిన సేవలను స్మరించుకోవడంతో పాటు భవిష్యత్ ఉద్యమాల దిశపై చర్చిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో AIKMS జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, PYL జిల్లా అధ్యక్షుడు వనమాల సత్యం, IFTU జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, POW నగర ప్రధాన కార్యదర్శి సంజనతో పాటు ప్రజాసంఘాల నాయకులు పవన్ కుమార్, మనోజ్, శంకర్, దాసు, రాజు, గణేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.










