కూకట్పల్లి నియోజకవర్గంలో వందలాది మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విశ్వాసంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో వందలాది మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని వారు తెలిపారు. టి.పి.సి.సి ఉపాధ్యక్షులు మరియు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పార్టీ కండువాలు కప్పి కొత్తగా చేరిన మహిళా కార్యకర్తలను బండి రమేష్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు జరుగుతున్న ప్రభుత్వ పథకాలు, మహిళల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నమ్మకాన్ని నిలబెట్టిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని బండి రమేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, భవిష్యత్తులో మరింత మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అర్హులైన ప్రతి మహిళా కుటుంబానికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మి, బి. బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, లక్ష్మయ్య, కేపీహెబీ డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్, బి. బ్లాక్ మహిళా అధ్యక్షురాలు సంధ్య, డివిజన్ అధ్యక్షురాలు రజితతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.











