కామారెడ్డి, 2026-06-30
జులై 2న ఉప్పల్ భగాయత్ లో నిర్వహించే భూ పోరాట సభకు పెద్దఎత్తున తరలి రావాలని టిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ నాయకుడు రవీందర్ గుప్తా పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీని మర్చిపోయిందని ఆరోపించారు.
జులై 2న ఉప్పల్ భగాయత్ లో నిర్వహించే భూ పోరాట సభకు టిఆర్ఎస్ ఉద్యమ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి రావాలని టిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ నాయకుడు రవీందర్ గుప్తా కోరారు. మంగళవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మర్చిపోయిందని ఆయన ఆరోపించారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ భూపోరాట సభను నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్తాఫ్, ఏసు, మమత పాల్గొన్నారు.










