ఎల్లారెడ్డిలో బీజేపీకి షాక్… కాంగ్రెస్‌లోకి భారీగా యువకుల వలస
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో ముదెల్లికి గ్రామానికి చెందిన 15 మంది కాంగ్రెస్‌లో చేరిక
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 27
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో ముదెల్లికి గ్రామానికి చెందిన 15 మంది బీజేపీ యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు తమను ఆకర్షించాయని యువకులు తెలిపారు. ప్రజలు నమ్మే పార్టీగా కాంగ్రెస్ ముందుకు సాగుతుందని, ఈ విశ్వాసంతోనే వివిధ పార్టీలకు చెందిన యువత, నాయకులు కాంగ్రెస్ వైపుకు పెద్దఎత్తున వస్తున్నారని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.