తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ముఖ్యమంత్రి కప్ (CM's Cup 2025-26) రెండవ ఎడిషన్ క్రీడలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్‌ను పలువురు ప్రముఖులు అభినందించారు.
హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో, క్రీడా శాఖ మంత్రి శ్రీ. వాకాటి శ్రీహరి, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాల దేవి రంగ వెంకటేశ్వర్ గౌడ్‌ను సన్మానించి, ఆయన కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ముఖ్యమంత్రి కప్ క్రీడలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించాయని, ఈసారి నిర్వహణ అత్యంత విజయవంతమైందని అధికారులు తెలిపారు. క్రీడల ద్వారా యువతకు మంచి వేదిక లభించిందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంతో పాటు, క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న చేయూత గురించి కూడా చర్చించారు. భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు.












